చంద్రబాబుకు భద్రత తగ్గించారంటూ హైకోర్టులో పిటిషన్

  • చంద్రబాబు కుటుంబసభ్యుల భద్రత కూడా తగ్గించారు
  • ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ కు 7 ప్లస్ 7 భద్రత ఇచ్చారు
  • ఇప్పుడు చంద్రబాబుకు 2 ప్లస్ 2 సెక్యూరిటీ ఇచ్చారంటూ పిటిషన్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి భద్రత తగ్గించారంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. తాము ఎలాంటి భద్రత తగ్గించలేదని ప్రభుత్వం చెబుతున్నా, టీడీపీ వర్గాలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, సుబ్బారావు అనే న్యాయవాది చంద్రబాబుకు భద్రత తగ్గించారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న చంద్రబాబుకు, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత తగ్గించారంటూ ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ కు 7 ప్లస్ 7 భద్రత కల్పించారని, ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు 2 ప్లస్ 2 భద్రత కల్పించారని సుబ్బారావు తన పిటిషన్ లో ఆరోపించారు. అలిపిరి దాడి, 2016లో ఒడిశా ఎన్ కౌంటర్ వంటి అంశాలను కూడా ఆయన తన పిటిషన్ లో ప్రస్తావించారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
Telugudesam
High Court

More Telugu News